ఇవీ చూడండి:
ఉగ్రగోదావరి.. ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Dawaleswaram barrage: ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. పరిస్థితిని జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. వరదకు సంబంధించిన వివరాలు ధవళేశ్వరం హెడ్ వర్క్స్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 15.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద సహాయక చర్యల్లో భాగంగా.. 4 ఎన్‌డీఆర్‌ఎఫ్, 4 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బ్యారేజీ నుంచి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తూ.. సముద్రంలోకి 15,20,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడిచి పెట్టడంతో దిగువన ఉన్న గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఇవీ చూడండి: