తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రామకృష్ణాకాలనీలో ఎస్ఈబీ అధికారులు అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. గోదాములో పాత సంచుల మాటున ఉన్న 8,496 మద్యం సీసాలను సీజ్ చేశారు. గోదాము యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకువచ్చి నిల్వ ఉంచారని అధికారులు తెలిపారు. పట్టబడిన మద్యం విలువ సుమారు రూ.13లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ.81.67 లక్షలు