తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, పెద్దాపురం సబ్‌డివిజన్లలోని శ్రీసత్యసాయి సేవా సంస్థలు 3వేల మంది వలస కూలీలకు ఆహారం అందించాయి. కిర్లంపూడి మండలం క్రిష్ణవరం టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై స్వగ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. సైకిళ్లపై, లారీల్లో, బస్సులో, నడిచి వెళ్తున్న వలస కూలీలకు పది రోజుల నుంచి ఆహారం ఏర్పాట్లు చేశామని సత్యసాయి సేవాసంస్థ సభ్యులు అన్నారు.
ఇదీచూడండి. సత్యసాయి సేవా సంస్థ దాతృత్వం