Festival With Snow: రాష్ట్ర వ్యాప్తంగా భోగి పండుగ రోజు ప్రకృతి మంచు దుప్పటి మాటున దాగిపోయింది. చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలు ప్రసరించవలసిన సూర్యుడు మంచు దుప్పటి మాటున దాగాల్సి వచ్చింది. సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి భోగిమంటలు వెలిగించి భోగి పండుగకు శ్రీకారం చుట్టారు. ఆవు నెయ్యితో భోగి మంటలు వెలిగించి భోగి పిడకల దండలను మంటల్లో వేశారు.
ఆవు నెయ్యితో భోగి మంటలు: చీకటి తెరలను చీల్చుకుంటూ మంచు పరదాలను తొలగించుకుంటూ వెలుగు రేఖలు ప్రసరించే వేళ తెలుగు లోగిళ్ళలో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి భోగిమంటలు వెలిగించి భోగి పండుగకు శ్రీకారం చుట్టారు. ఉభయ గోదావరి జిల్లాలలో భోగి పండుగ వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. తణుకు ఉండ్రాజవరం పరిసరాల్లో భోగి పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఆవు నెయ్యితో భోగి మంటలు వెలిగించి భోగి పిడకల దండలను మంటల్లో వేశారు. భోగి పండుగ రోజు భోగిమంటలను వేస్తే ఆ మంటల సెగతో శరీరంలోని సర్వ రుగ్మతలు మటు మాయమవుతాయని ప్రజల విశ్వాసం.
మంచులో దాగిన ప్రకృతి అందాలు: భోగి పండుగ రోజు తణుకు పరిసరాల్లో మంచు దుప్పటి కప్పేసింది. కనీసం 100 అడుగుల దూరంలో కనిపించనంత దట్టమైన రీతిలో మంచు కప్పేయడంతో ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంది. పట్టణంలో సైతం మంచు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు రాత్రి మాదిరిగా లైట్లు వేసుకుని ప్రయాణించవలసి వచ్చింది. లైట్లు వేసుకున్నప్పటికీ అతి తక్కువ వేగంతో వాహనదారులు ముందుకు సాగారు.
పొగ మంచు జల్లుల వాన: అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి స్థిరంగా కొనసాగుతోంది. దట్టమైన పొగ మంచు కమ్మేసింది. పాడేరులో పొగ మంచు జల్లుల వాన కురుస్తోంది. రహదారులన్నీ తడిచాయి. కనిష్టంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. భోగిమంటలు వేసుకోవడానికి బయటికి వచ్చారు. కొందరు సమీపంలో ఉన్న భోగిమంటల వద్ద సేదతీరారు. దట్టమైన పొగ మంచుతో లైట్లు వెలుతురులో వాహనాలు ప్రయాణిస్తున్నాయి.
ఇవీ చదవండి