ETV Bharat / state

సంక్రాంతి సందడి మొదలు.. ఊరూరా భోగి మంటలు - భోగి మంటలు

Sankranti: భోగి.. తెలుగు లోగిళ్లను సంక్రాంతి సంబరాల్లోకి ఆహ్వానించే తొలి రోజు. పాత వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేసి.. కొత్త దుస్తులు, వస్తువులతో నిత్యనూతనంగా... సుఖ, సంతోషాలతో జీవించడమే భోగి పండుగ విశిష్టత. జీవించినంత కాలం ఆధ్యాత్మిక చింతనతో పాటు లౌకిక జీవన విధానాన్ని అనుసరించడమే భోగి పండుగ ఇచ్చే సందేశం.

bhogi
bhogi
author img

By

Published : Jan 14, 2023, 7:19 AM IST

Updated : Jan 14, 2023, 8:10 AM IST

సంక్రాంతి సందడి మొదలు.. ఊరూరా భోగి మంటలు

Sankrati Festival: సంక్రాంతి సందడి మొదలైంది. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగే భోగి. ఇక్కడితో సంక్రాంతి సందడి మొదలు. పాత పోయి కొత్త తెచ్చే పండుగ ఇది. సంక్రాంతి రైతు పండుగైతే.. భోగి ఆటపాటల పండుగ. కొత్త సమయం, కొత్త పంట.. చలిని తరిమి నులి వెచ్చదనాన్ని తెచ్చే పండుగే భోగి.

సంక్రాంతి పండుగకు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాధాన్యం ఉంది. ప్రాంతాల వారీగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ... వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్కృతీ సంప్రదాయాల ఆధారంగా జరుపుకొంటారు. భౌగోళిక సరిహద్దుల్ని బట్టి ఈ రీతులు మారుతుంటాయి. పాడి పంటలకు సంబంధించిన పండుగ కాబట్టి.. ప్రతిచోటా ప్రధానంగా కనిపించే అంశాలు భోగి మంటలు, పిండి వంటలు. పండుగ వేళ చేసుకునే సంబరాలు ఆనందాన్ని రెట్టింపు చేస్తే... ప్రాంతాల వారీగా జరిగే పందేలు ఎక్కడో మూలన దాక్కున్న పౌరుషాల్ని తట్టి లేపుతుంటాయి.

సంక్రాంతి సందడికి అసలు సిసలు చిరునామా మన పల్లెటూళ్లే. బతుకుదెరువుకు ఎంత సుదూర ప్రాంతాలకు వెళ్లినా... సొంతూరుని వెతుక్కుంటూ రావడం ఆనవాయితీ. పిల్లా-పెద్ద, పేద-ధనిక తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకొనే అపురూపమైన తెలుగింటి పండుగ. భోగి మంటలు, గొబ్బెమ్మలతో అలరించిన రంగవల్లులు... కొత్త దుస్తులు.. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు... పౌరుషానికి ప్రతీకలైన కోడిపందేలు... గంగి రెద్దుల విన్యాసాలు, స్వాగతం చెప్పే పచ్చటి పంటలు... పొలం గట్లపై పైరు గాలి పీలుస్తూ చిలిపిగా తిరిగిన చిన్ననాటి స్మృతుల్ని గుర్తుచేసుకునే క్షణాలు.. ఇలా ఎంత చెప్పినా తనివితీరదు.

సంక్రాంతి అన్నిచోట్లా ఎంతో ఘనంగా చేసుకుంటున్నా.. గోదావరి జిల్లాల్లో అయితే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు... పొలం గట్లపై నడిచి వస్తుంటే... చూడటానికి రెండు కళ్లూ సరిపోవు.

ఉమ్మడి కుటుంబాల్ని గుర్తుకు తెస్తూ.. ఆప్యాయత, అనురాగాలకు అద్దం పట్టే పండుగ సంక్రాంతి. పాత బాధలన్నింటినీ భోగి మంటల్లో ఆహుతి చేసి.. సరికొత్త ఆశలు, ఆకాంక్షలకు నాంది ప్రస్తావన పలికే సంబరాలు. మకర సంక్రాంతి పర్వదినాన సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత‌్తరాయణంలో ప్రవేశిస్తాడు. దక్షిణాయన సమయంలో ఆరుగాలం శ్రమించి అన్నదాత పండించిన పంట.. ఇంటికి చేరే సమయం ఇదే. ఈ సమయంలో గాదెలన్నీ ధాన్య రాశులతో నిండిపోతాయి. అలా కొత్తగా ఇంటికి చేరిన ధాన్యంతో వండిన తొలి నైవేద్యాన్ని దేవదేవుడికి సమర్పించి.. ఇన్నాళ్లూ సహకరించిన దైవానికి కృతజ్ఞతలు చెబుతారు.

వాస్తవానికి తెలుగులోగిళ్లలో పండుగ శోభ.. నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది. ధనుర్మాసారంభంతో పండగ హడావుడి ప్రారంభమవుతుంది. తెలుగు ఆడపడుచులు... కోడికూయక ముందే నిద్రలేచి... దారులన్నీ సప్తవర్ణ శోభితమైన రంగవల్లులతో నింపేస్తారు. ప్రతి లోగిలి చూడముచ్చటైన గొబ్బెమ్మలతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఉదయం హరిదాసుల కోలాహలంతో మొదలవుతుంది. గంగిరెద్దుల ఆటలతో సరదాగా గడుస్తుంది. పండగ సమీపించే కొద్దీ.. వేర్వేరు ప్రాంతాల నుంచి తరలివచ్చే బంధువులు.. వాళ్ల పలకరింపులతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది.

Last Updated : Jan 14, 2023, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.