తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడిపల్లిలో ఇసుక కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఇసుక ర్యాంపులలో తమకు పని కల్పించట్లేదని ధర్నా చేశారు. ఈ ర్యాంపులలో కూలీలతోనే పనిచేయించాల్సి ఉండగా... రాత్రివేళల్లో యంత్రాలతో ఇసుక రవాణా చేస్తున్నారని వాపోయారు. ఉదయం పనికోసం వెళ్తే... పనిలేదు, ఏమిలేదు పొమ్మంటున్నారని వారు తెలిపారు. పనులు లేక తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి: సీఎంకు లోకేశ్ లేఖ