ETV Bharat / state

పకడ్బందీ చర్యలతో రోడ్లపైకి బస్సులు - తూర్పుగోదావరిలో ఆర్టీసీ వార్తలు

లాక్​డౌన్ సడలింపుల తరువాత... బస్సులు రోడ్డెక్కిన సందర్భంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఆర్టీసీ డిపో కేవలం 15 బస్సులనే నడపనున్నట్లు తెలిపారు.

rtc buses are going to run with corona preventive measures at east godavari
పకడ్బందీ చర్యలతో రోడ్లెక్కనున్న బస్సులు
author img

By

Published : May 21, 2020, 10:06 AM IST

తూర్పుగోదావరి జిల్లా తుని ఆర్టీసీ డిపో నుంచి.. ముందుగా కేవలం 15 బస్సులను మాత్రమే నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తుని డిపో నుంచి కాకినాడకు 7, రాజమహేంద్రవరానికి 5, నర్సీపట్నానికి 3 బస్సులు నడపనున్నారు. రాజమహేంద్రవరం, నర్సీపట్నం డిపోల నుంచి కూడా ఇదే సంఖ్యలో బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడుస్తాయని తెలిపారు.

బస్సులో కండక్టర్లు లేకుండా కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటారన్నారు. ప్రయాణికులు బస్ స్టాండ్ వద్ద టికెట్టు తీసుకుని బస్సు ఎక్కాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఆర్డినరీ బస్సులను మాత్రమే నడుపనున్నట్లు, అవి కూడా పరిమిత స్టేజీల్లోనే అగుతాయని స్పష్టం చేశారు. ఆయా బస్టాండ్​ల వద్ద కండక్టర్​లు అందుబాటులో ఉంటారు. వారి వద్ద టిక్కెట్టు తీసుకుని బస్ ఎక్కాల్సి ఉంటుందని వివరించారు.

తుని నుంచి రాజమహేంద్రవరం మార్గంలో...

  • అన్నవరం
  • కత్తి పూడి
  • ప్రత్తిపాడు
  • జగ్గంపేట
  • రాజనగరం

తుని- కాకినాడ మార్గంలో...

  • అన్నవరం
  • కత్తిపూడి
  • పిఠాపురం

తుని నుంచి నర్సీపట్నం మార్గంలో...

  • కోటనందురుల

పకడ్బందీగా చర్యలు

కరోనా వైరస్ ఏ మాత్రం వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్డినరీ బస్సు లో 25 మంది మాత్రమే ప్రయాణించేలా సీట్లు కేటాయించారు. ముగ్గురు కూర్చునే సీటులో ఇద్దరు, ఇద్దరి సీటులో ఒకరే కూర్చునేలా చర్యలు చేపట్టారు.

ఇందుకు అనుగుణంగా మార్కింగ్ చేశారు. అదేవిధంగా ప్రయాణికులు వేచి ఉండేందుకు కూర్చునే సీట్లలోనూ భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుందని నిబంధన విధించారు.

ఇదీ చదవండి:

గురుకుల పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.