రాజమహేంద్రవరంలో 5 కోట్ల రూపాయలు చిట్టీలతో వ్యక్తి ఉడాయించాడు. చిట్టీల డబ్బుతో పరారైన వ్యక్తిని పట్టుకోవాలంటూ.. ఐదు బండ్ల మార్కెట్ సెంటర్ వద్ద బాధితులు రాస్తారోకో చేపట్టారు. పట్నాల వెంకటరమణ పదేళ్లుగా చిట్టీలు కట్టించుకుంటున్నారు. ఈయన వద్ద రాజమహేంద్రవరంతోపాటు ఉభయగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన వారు చిట్టీలు వేస్తున్నారు. కొంత కాలంగా గడువు ముగిసిన వారికి డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేస్తున్నాడు. డబ్బులు ఇవ్వాలని నిలదీయడంతో ఇంటికి తాళం వేసి వెంకటరమణ పరారయ్యాడు.
మోసపోయామని గ్రహించిన బాధితులు.. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా ఏం చేయలేమని చెప్పడంతో.. బాధితులు ధర్నాకు దిగారు. నిందితుడిని పట్టుకుని డబ్బు ఇప్పించాలని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: Dowry Harassment: వరకట్న దాహానికి వివాహిత బలి