RRR Movie Tickets: తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని ఒక థియేటర్, తాటిపాకలోని మూడు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోకి అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే.. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా అమ్ముతున్నారని రాజోలులో అభిమానులు ఆందోళన చేస్తున్నారు. రాజోలులో ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక్కో టికెట్ ధర రూ.800 నుంచి రూ.1000గా నిర్ణయించడంతో అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రి 1.30 వరకు డిస్ట్రిబ్యూటర్, ఫ్యాన్స్ కాసేపు రహదారిపై ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రహదారి వద్దకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టికెట్ల ధర రూ.205,రూ.150 చొప్పున రెండు క్లాసులుగా కేటాయించి టికెట్లు విక్రయించాలని ఆందోళనలు చేశారు. రెవిన్యూ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కేటాయించిన ధరలకే కౌంటర్ల వద్ద టికెట్లు విక్రయించాలని అభిమానూలు నినాదాలు చేశారు. ఆర్ఆర్ ఆర్ సినిమా టికెట్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అమ్మాలని అభిమానులు తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Pawan Kalyan: నేతాజీని గౌరవించుకోకపోతే.. మనం భారతీయులమే కాదు: పవన్