ETV Bharat / state

గోదావరిలో జల్లెడ పట్టినా.. దొరకని బోటు జాడ!

గత నెలలో గోదావరిలో మునిగిన రాయల వశిష్ట బోటు జాడ ఇంకా తెలియలేదు. బోటు వెలికితీతలో భాగంగా బాలాజీ మెరైన్‌ బృందం రెండో రోజు గోదావరిలో జల్లెడ పట్టినా ఫలితం దక్కలేదు.

గోదావరిలో జల్లెడ పట్టినా.. దొరకని బోటు జాడ
author img

By

Published : Oct 2, 2019, 5:34 AM IST

తెలుగు రాష్ట్రాలో పెను విషాదం నింపిన గోదావరి బోటు ప్రమాదం వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ బృందం సభ్యులు రెండోరోజు చేపట్టిన పనులు ఫలితాలు ఇవ్వలేకపోయాయి. రెండోరోజు గంగమ్మకు పూజలు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. నదిలోకి రోప్‌ వేసిన కొద్దిసేపటికే.. బండరాయికి పట్టి దాదాపు 600 మీటర్ల రోప్‌తో పాటు లంగరు నదిలో పడిపోయాయి. అనంతరం మరో రోప్‌, లంగరును నీటిలోకి దింపి సహాయకచర్యలు చేపట్టారు. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. బాలాజీ మెరైన్‌ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో 25 మంది బృందంతో పాటు కొంతమంది స్థానికులు, పోలీసులు ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు. ఇవాళ కూడా బోటు వెలికితీసే ప్రయత్నాలు కొనసాగనున్నాయి.

గోదావరిలో జల్లెడ పట్టినా.. దొరకని బోటు జాడ

ఇదీ చదవండి:తొలిరోజు ఫలించని బోటు వెలికితీత పనులు

Intro:ap_cdp_19_01_dasara_uchavalu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కడప లో వెలసిన శ్రీ విజయ దుర్గ దేవి ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా వేడుకలను జరుపుకుంటున్నారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో చక్కగా అలంకరించారు. దేవతల ప్రతిమలను రంగు విద్యుద్దీపాలతో ఏర్పాటు చేశారు. ఆలయమంతా విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. అమ్మవారు భక్తులకు చంద్రగంట దేవి రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణమంతా అమ్మ నామస్మరణతో మారుమోగిపోయింది. కోలాటం చెక్కభజన తో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Body:దసరా ఉత్సవాలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.