తూర్పుగోదావరి జిల్లాలోకి బయటి ప్రాంతాల నుంచి ఎవరూ ప్రవేశించకుండా సరిహద్దుల్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని అమలాపురం ఆర్డీవో భవాని శంకర్, డీఎస్పీ బాషా చెప్పారు. కొత్తపేట రెడ్‌జోన్ ప్రాంతాన్ని ఆర్డీవో పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొత్తపేటలో 3 పాజిటివ్ కేసులు వచ్చాయని.. కాకినాడలో 14 రోజుల చికిత్స తరువాత వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చిందన్నారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్ నుంచి గ్రీన్‌జోన్ గా మారుస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పాటు.. వలస కూలీల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: