తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని అనేక గ్రామాల్లో రేషన్ డీలర్లు, వినియోగదారులకు ఈ-పాస్ యంత్రాల నెట్వర్క్ సమస్య తలనొప్పిగా మారింది. ఈ-పాస్ యంత్రాల సర్వర్ సమస్యతో ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీకి ఆటంకం కలుగుతోంది. నవంబరు నెలకు సంబంధించి కోటా సరకులు తీసుకునేందుకు వచ్చిన వినియోగదారులు గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సర్వర్ పనిచేయకపోవడం వల్ల డీలర్లు లాగిన్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సరకుల కోసం సాయంత్రం వరకు వేచి చూసి నిరాశతో వినియోగదారులు వెనక్కి వెళ్లారు. ఈ నెల కోటా సరకులు తీసుకునేందుకు ఆఖరి రోజు కావడం వల్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి : వైన్స్‌కు అడ్డురాని కరోనా నిబంధనలు.. మీడియాకు అడ్డువస్తున్నాయా..?