తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముస్లింలు రంజాన్ పండగను ఇళ్లలోనే జరుపుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ మసీదుల్లో భారీగా ప్రార్థనలు చేసేవారు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ధి గాంచిన నెహ్రూనగర్ మసీద్‌కు తాళాలు వేశారు. మిగతా మసీదులు కూడా మూసివేశారు.
ముమ్మిడివరంలో రంజాన్ పండగను ముస్లింలు ఇంటి వద్దే జరుపుకున్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేయడం చివరిరోజు నెలవంక దర్శనంతో దీక్షలు ఉపసంహరించి పండగ చేసుకోవడం ఏటా జరిగేదే... కానీ ఈ ఏడాది కరోనా ప్రభావంతో ప్రత్యేక ప్రార్థనలు లేవు...ఒకరినొకరు ఆలింగనాలు లేవు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో పండగ సందడే కనిపించలేదు.