అడవుల్లో సంచరించే అరుదైన పునుగు పిల్లులు జనారణ్యంలో ప్రత్యక్షమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం మకిలిపురంలో ఓ ఇంటిపై రాత్రి వేళల్లో సంచరిస్తున్న రెండు నెలల వయస్సున్న పిల్లులను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వీటిని పట్టుకున్న అటవీ అధికారులు.. వాటిని పునుగు పిల్లులుగా గుర్తించారు. అవి ఆరోగ్యంగానే ఉన్నాయని త్వరలోనే అడవుల్లో విడిచిపెడతామని తెలిపారు.
రాజమహేంద్రవరంలో విద్యుదాఘాతానికి గురై గాయాలపాలనైన మూడేళ్ల వయస్సున్న మరో పునుగుపిల్లిని కూడా అటవీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం దీని వైద్యం చేస్తున్నామని.., గాయం నయమయ్యాక జంతుప్రదర్శన శాలకు అప్పగించాలా ? అడవుల్లో వదిలేయాలా ? అనేది ఆలోచిస్తామని వన్యప్రాణి సంరక్షణ విభాగం వైద్యాధికారి డాక్టర్ ఫణీంద్ర తెలిపారు.
ఇదీచదవండి