పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన దాత.. జాల రాజీవ్ కుమార్ 1500 కుటుంబాలకు నిత్యావసర సరకులు, గుడ్లు పంపిణీ చేశారు. జాల అబ్రహం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీటిని సమకూర్చారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్థానిక యువకుల సాయంతో ఇంటింటికీ తిరిగి సరకులు అందించారు.
లాక్ డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో మొదటి విడతలో గ్రామంలోని 250 పేద కుటుంబాలకు భోజనం పొట్లాలు అందచేశారు. అనంతరం పదిహేను వందల కుటుంబాలకు కూరగాయల అందించారు. మూడో విడతలో భాగంగా నిత్యావసర సరకులను అందిస్తున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు. దేవానందం, శామ్యూల్, వెంకటరత్నం, విజయ్ కుమార్పా ల్గొన్నారు.
ఇదీ చదవండి: