తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివిస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. గతంలో అరెస్టైన పలువురు ఈరోజు జైలు నుంచి విడుదల అయ్యారు. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయగా.. తుని సబ్ జైలులోని 23 మంది బయటకు వచ్చారు.
జైలు వద్ద వారికి వామపక్ష, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు దగ్గరుండి వారిని స్వగ్రామాలకు తీసుకుని వెళ్లారు. ఈ కేసులో 36 మంది అరెస్టు కాగా.. మిగిలిన వారు కాకినాడ, రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు.
ఇదీ చదవండి: