ETV Bharat / state

దర్శనాల కోసం అంతర్వేది ఆలయంలో ఏర్పాట్లు

author img

By

Published : May 27, 2020, 2:13 PM IST

లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలు దాదాపుగా మూతపడ్డాయి. భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ఒక్కో విడత లాక్ డౌన్​లో కొన్నింటికి సడలింపులు ఇస్తున్నారు. ఈసారి దేవాలయాలకూ అనుమతి లభిస్తుందని దేవాలయ పాలకమండళ్లు భావించి దర్శన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

Breaking News

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంలోనూ లాక్​డౌన్​తో దర్శనాలు నిలిపేశారు. ఏకాంత సేవలు కొనసాగించారు. విడతల వారీగా లాక్​డౌన్​ సడలిస్తున్న ప్రభుత్వం... దైవదర్శనాలకు అనుమతి ఇస్తుందని దేవాలయ పాలకమండళ్లు భావిస్తున్నాయి. అందుకే అంతర్వేదికీ వెసులుబాటు లభిస్తుందని భావించి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు.. భౌతిక దూరం పాటించేందుకు మార్కింగ్​ చేస్తున్నారు.

వీఐపీ, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం ఇలా మూడు విభాగాలకు సంబంధించి సుమారు ఐదు వందల మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ మార్కింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వెలువడే నిబంధనల మేరకు దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఇది చదవండి కరోనా రికవరీలో తెలుగు రాష్ట్రాలు భేష్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.