Pregnant Women Skip From Fitness Test In Police Recruitment: తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామకాలు కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో గర్భిణీలకు మినహాయింపునిస్తున్నట్లు పోలీస్ నియామక మండలి అధికారులు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనకుండానే తుది అర్హత పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుది అర్హత పరీక్ష పాసైన నెలలోపు.. దేహ దారుఢ్య పరీక్షలో పాల్గొని అందులోనూ అర్హత సాధిస్తేనే వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగం లభిస్తుందని పేర్కొన్నారు.
దేహదారుఢ్య పరీక్షల కోసం గర్భిణీ అభ్యర్థులు నిబంధనలు.. అంగీకరిస్తున్నట్లు లేఖ రాసివ్వాలని పోలీసు నియామక మండలి అధికారులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు గర్భిణీలకు ఈ మినహాయింపు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసు ఉద్యోగాల కోసం కృషి చేస్తున్న అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ప్రస్తుతం 9 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ఇప్పటికే ముగిశాయి. దేహదారుఢ్య పరీక్షలు గతంతో పోలిస్తే కాస్త సులభతరమయ్యాయని.. 70శాతానికి పైగా అభ్యర్థులు అర్హత సాధిస్తున్నారని అధికారులు వెల్లడించారు. మరో 10రోజుల్లో దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: