ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈనెల 19 నుంచి ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడున్న పంచాయతీ చట్టాలను పూర్తిగా అమలు చేయకుండా పంచాయతీరాజ్ నిర్వీర్యం చేస్తూ నూతన చట్టాలను రూపొందిస్తున్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 200 మంది పోలీసులకు తొమ్మిది నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవటం సహా సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తున్నారన్నారు. ఈ విషయమై అసోసియేషన్ వ్యవస్థ ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ఇదీ చూడండి: