దేశంలో తొలిసారిగా 80 సంవత్సరాల పైబడిన వారు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు.. పుదుచ్చేరిలో ఇంటివద్దనుంచే ఓటువేయనున్నారు. వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనేలా కేంద్రం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కేంద్ర పాలిత పుదుచ్చేరి రాష్ట్రంలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు. కేంద్రపాలిత యానంలో 80 సంవత్సరాలు పైబడిన వారు 280 మంది, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు 226 మంది మొత్తంగా 506 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.
ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు ఐదు బృందాలు వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే సిబ్బందికి దీనిపై శిక్షణ ఇచ్చామన్నారు. ఒక్కో బృందం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు. . మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు.. 25 మంది నుంచి ఓట్లను సేకరించాలని అన్నారు. నాలుగు రోజుల్లో ఏదైనా కారణాల వల్ల ఓటు హక్కు వినియోగించుకోనివారికి .. మరొక రోజు కేటాయించామని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏ కారణం చేతనైనా ఓటు వినియోగించుకోకుండా ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ బూతులో ఓటు వేసే అవకాశం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి. రూ. 250కే 10 ఎంబీపీఎస్ నెట్