తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం చిలక మామిడి గ్రామంలోని సారా బట్టీల పై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఐ ఏవీవీ ప్రసాద్ తెలిపారు. కాకినాడ అదనపు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో సారాతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ దాడుల్లో నీలపల్లి చెక్ పోస్ట్ సీఐ, దేవీపట్నం ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రగతి లేదు..90వేల కోట్లు అప్పు మాత్రం ఉంది: బుచ్చయ్య చౌదరి