ETV Bharat / state

'నిర్భయంగా ఓటేయండి... వివాదాల జోలికి పోకండి' - స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు భద్రతా పరమైన చర్యలు చేపట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటేయాలని, వివాదాల జోలికి వెళ్ళొద్దని సూచించారు.

District SP inspected polling stations
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
author img

By

Published : Feb 7, 2021, 10:27 PM IST

మొదటి విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట సర్కిల్ కార్యాలయం పోలీస్ స్టేషన్​ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఐ సురేష్ బాబు, ఎస్సై రామకృష్ణకు కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. భద్రతా ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రత్యేక బలగాలతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రంపచోడవరం వచ్చారు. ముందుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఎర్రంపాలెం ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. ఏజెన్సీలో సీఆర్పీఎఫ్, ఏఎన్ఎస్ బలగాలతో పటిష్టమైన భద్రతను నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

పోలీసుల కవాతు

తొండంగి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. అదనపు ఎస్పీ కరణం కుమార్ అధ్వర్యంలో డీఎస్పీలు, సీఐ, ఎస్సైలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కవాతు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా ఓటేయాలని, వివాదాల జోలికి వెళ్ళొద్దని కోరారు.

కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో తాళ్ళరేవు మండలంలో 16 పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లు నిర్భయంగా తమఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ పోలీసులు సమస్యాత్మక గ్రామాల్లో పహారా నిర్వహించారు. తాళ్లరేవు మండల పరిధిలో గాదిమొగ, తాళ్లరేవు, పోలేకుర్రు, సుంకరపాలెం, పిల్లంక గ్రామ పంచాయతీలు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో జాతీయ రహదారి 216 తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులను.. వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

అభ్యర్థులు ఖరారు

రావులపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఖరారు చేశాయి. జిల్లాలో వాణిజ్య పరంగా పెద్ద పంచాయతీ అయిన రావులపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ సర్పంచ్ పోతు ముడి విజయలక్ష్మి, వైకాపా తరపున తాడేపల్లి నాగమణి, జనసేన తరపున చిర్ర నిర్మలాకుమారినిర్మలాకుమారిలు పోటీ చేయనున్నారు.

ఇదీ చదవండి:

నిజమైన 'శ్రీమంతుడు'.. ఊరికి తిరిగి ఇచ్చేస్తున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.