కరోనా నేపథ్యంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. పెట్టుకోని వారిపై కఠిన చర్యలు ఉంటాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రావులపాలెంలో రహదారిపై మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారిపై సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
'నేను మూర్ఖుడిని.. అందుకే మాస్కు పెట్టుకోలేదు' అని రాసున్న ప్లకార్డుల్ని వారికిచ్చి రోడ్డుపై నిలబెట్టారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే శిక్షలు ఇలాగే ఉంటాయని హెచ్చరించారు. కరోనా కట్టడికి బాధ్యతో సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి: