ETV Bharat / state

'ప్యాకేజీ పూర్తిగా చెల్లించకపోతే గ్రామాలు ఖాళీ చేయం'

పూర్తిస్థాయిలో చెల్లింపు జరపకుండా గ్రామాలు ఖాళీ చేయమనడంపై పోలవరం నిర్వాసితులు రంపచోడవరం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చుతామనడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

polavaram villagers agitation at rampachodavarm rdo office
'ప్యాకేజీ చెల్లించకుండా గ్రామాలు ఖాళీ చేయం'
author img

By

Published : Mar 15, 2021, 6:16 PM IST

పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీ పరిహారం చెల్లించకుండా అధికారులు గ్రామాలను ఖాళీ చేయమనడంతో పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట దేవీపట్నం మండలం తొయ్యేరు, వీరవరం గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఆందోళన చేపట్టారు.

ప్యాకేజీ సొమ్ము చెల్లించండి..

తమకు పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీ చెల్లించలేదని, కనీసం తమకు కేటాయించిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయకుండా గ్రామాలు ఖాళీ చేయాలంటూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ నెల 18వ తేదీలోగా గ్రామాలను ఖాళీ చేయకుంటే జేసీబీలతో కూల్చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పడాన్ని తప్పుబడుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసి.. మిగిలిన సొమ్ము చెల్లించిన తర్వాతే ఇళ్లను ఖాళీ చేయించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'జగన్ పాలన పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.