తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకయ్యింది. ఓఎన్జీసీ నిర్వహణ పనుల్లో భాగంగా... రిగ్గు వద్ద కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. ఆ సమయంలో రిగ్గు వద్ద పైప్లైన్ నుంచి గ్యాస్ లీకైంది. భారీగా సహజ వాయువు వస్తుండగా... స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. భారీగా గ్యాస్ లీకవడం వల్ల ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది గ్యాస్లీక్ను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
సమీపంలో ఉన్న గంటివారిపేట, ఉప్పూడి ప్రజలను పోలీసులు సహాయంతో ఖాళీ చేయించారు. కాట్రేనికోన ప్రధాన రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ఘటనాస్థలం సమీపంలోని పరిసరాలకు ఎవరూ రాకుండా పోలీసులు అప్రమత్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీశ్, అమలాపురం డీఎస్పీ బాషా, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. ఉప్పూడి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఇదీ చదవండి :