ఇదీ చూడండి
ధర్మవరం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - latest updates of east godavari boy died
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆనంద్ గుప్తా కొద్దికాలంగా ధర్మవరంలో ఒంటరిగా ఉంటున్నాడు. అర్థరాత్రి చుట్టుపక్కల వారిని తాగడానికి నీళ్లు అడిగాడని... కొద్దిసేపటికే మృతి చెందాడని స్థానికులు చెప్పారు. గుప్తా వేసుకున్న బట్టలపై రక్తపు మరకలు ఉండటం అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ధర్మవరంలో యువకుడు అనుమానాస్పద మృతి
ఇదీ చూడండి