వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ విడదల ప్రతి భారతీయుడి విజయమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల రిబ్బెన్లతోనిరసన వ్యక్తం చేశారు. భాజపా నేత యడ్యూరప్ప రాజకీయ ఉన్మాద ఆలోచనలు చేస్తారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో మోదీ కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు.
భాజపా విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిరసనలు చేపడుతామన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రెండెళ్లలో పోలవరం పూర్తిచేస్తామన్నారు. విశాఖపట్టణంలో కాంగ్రెస్ భరోసా యాత్ర అనుమతిని రద్దు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.