ETV Bharat / state

'వాయుగుండం దృష్ట్యా తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి'

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దృష్ట్యా...తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని జేసీ లక్ష్మీ షా స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి
తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి
author img

By

Published : Oct 12, 2020, 7:48 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా కోస్తాంధ్ర తీరం వైపుకు దూసుకొస్తుండటంతో.. తూర్పుగోదావరి జిల్లాలో దాని ప్రభావంపై జిల్లా సంయుక్త కలెక్టర్​ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేసినట్లు జేసీ లక్ష్మీ షా స్పష్టం చేశారు. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా..కాకినాడ, ఉప్పాడ బీచ్​రోడ్లు మూసేసినట్లు వెల్లడించారు.

వాయుగుండం దృష్ట్యా తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న షా...అమలాపురం డివిజన్​లో తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్టీఆర్​ఎఫ్​, ఎస్టీఆర్​ఎఫ్​ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు.

ఇదీచదవండి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.