తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్లో రిలయన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 10కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. దేవీ ఫిషరీష్ ప్రతినిధిలు.. వైద్య సామగ్రిని మంత్రి ద్వారా అధికారులకు అందించారు. జీజీహెచ్ ఈఎన్టీ బ్లాక్ వద్ద ఆధునికీకరించిన ట్రయాజ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రపంచమంతా కొవిడ్ భయాందోళలతో ఉందని, ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. సామాజిక బాధ్యతగా మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: