తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని అర్జిత సేవలు, పూజలను విదేశాల్లో ఉండే భక్తులు చేయించుకునే విధంగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. పూజ చేయించుకోవాలనుకుంటున్న భక్తులు నిర్ణీత రుసుమును( భారత దేశ కరెన్సీకి సరిపడ డాలర్లు) ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే వారి పేరు మీద పూజలు నిర్వహిస్తారు. కమిషనర్ ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు.
ఇదీ చూడండి: