తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఓఎన్జీసీ పైపులైన్ లీకేజీ స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇక్కడ మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ అయ్యింది. పైప్‌లైన్ లీకేజీని సిబ్బంది అదుపు చేస్తున్నారు. తరచూ గ్యాస్ లీకేజీ అవుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్ లీకేజీలు అంతర్వేదిలో నిత్యకృత్యంగా మారాయి. తరుచూ ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల స్థానికుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండీ...'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'