ETV Bharat / state

DEATH: ఆయిల్​ ట్యాంకర్​ ఢీకొని రైతు మృతి - east godavari news

తూర్పుగోదావరి జిల్లా చల్లపల్లి వద్ద ఓ ఆయిల్​ ట్యాంకర్​ ఢీకొని పేరాబత్తుల వెంకట సత్యనారాయణ (55) అనే రైతు మృతి చెందాడు. దీనిపై గ్రామస్తులు నష్టపరిహారం చెల్లించాలంటూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు.

DEATH
ఆయిల్​ ట్యాంకర్​ ఢీకొని రైతు మృతి
author img

By

Published : Aug 8, 2021, 12:27 AM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఓ రైతు మృతి చెందాడు. చల్లపల్లికి చెందిన పేరాబత్తుల వెంకట సత్యనారాయణ (55) పొలం పనులు ముగించుకుని సైకిలుపై ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఎస్​.యానం నుంచి అమలాపురం వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ రైతు సత్యనారాయణను వెనుకనుండి ఢీ కొట్టింది. దీంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

సంఘటన జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలోనే సదరు రైతు సత్యనారాయణ ఇల్లు ఉంది. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా.. ఇలా ప్రమాదం రూపంలో ఆయన మరణించడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికులు సైతం దీనిపై దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్​ను అడ్డుకున్న గ్రామస్తులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఇదీ చదవండి:

గోదావరిలో దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నం..కాపాడిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.