తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామానికి చెందిన డేవిడ్ రాజు... గేదెలంక గ్రామానికి చెందిన ఉమాసాయిబాబుతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా... భారీగా అలలు రావటంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో డేవిడ్ రాజు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరో వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: