ETV Bharat / state

మార్కెట్​ యార్డులో అధికారుల చేతివాటం... చర్యలకు ప్రభుత్వం ఆదేశం - Officials misuse funds at Kottapeta market yard east Godavari district

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అరటి మార్కెట్ యార్డ్​లో నిధులు దుర్వినియోగం చేయడంపై ఎనిమిది మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తపేట మార్కెట్​ యార్డులో అధికారుల చేతివాటం.... చర్యలకు ప్రభుత్వం ఆదేశం

author img

By

Published : Nov 13, 2020, 4:27 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అరటి మార్కెట్ యార్డులో నిధులు దుర్వినియోగం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన ఎనిమిది మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్కెట్ యార్డు పరిధిలోని రావులపాలెం, బొబ్బర్లంక, గోపాలపురం, గంటి, బోడిపాలెం వంతెన వద్ద చెక్ పోస్ట్​లు నిర్వహించేవారు. వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాల నుంచి ఒక శాతం ఫీజులను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయకుండా ఐదుగురు సిబ్బంది సొంతానికి వాడుకున్నారు. 2018లో ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. రూ.27 లక్షలు అవినీతి జరిగిందని గుర్తించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న స్వామినాథ్, సత్యనారాయణమూర్తి, ఏవి శ్రీధర్, మల్లికార్జున రావు, పట్టాభిరామన్నతో పాటు రెహమాన్, సత్యనారాయణ, కిషోర్​లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది.

ఇవీ చదవండి

కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్​ రిటర్న్​ గిప్టులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.