ETV Bharat / state

గల్లంతైన బోటు కోసం.. ఐదో రోజూ గాలింపు - officers finding boat accident

గోదావరిలో గల్లంతైన బోటు కోసం అధికారులు ఐదో రోజూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమవారి ఆచూకీ కోసం బాధిత కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. ముంబయి నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందం నివేదిక వచ్చాకే... బోటును ఎలా బయటకు తీసేది నిర్ణయించగలమని తూర్పు గోదావరి సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీ షా చెప్పారు.

బోటు కోసం గాలింపు
author img

By

Published : Sep 19, 2019, 4:10 PM IST

Updated : Sep 19, 2019, 5:26 PM IST

గల్లంతైన బోటు కోసం ఐదో రోజు కొనసాగుతోన్న గాలింపు

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు ఘటనా స్థలంతో పాటు నదీ ఒడ్డున గాలింపు ముమ్మరం చేశాయి. తమవారి ఆచూకీ తెలపాలంటూ బోటు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద అధికారులను వేడుకుంటున్నారు. కనీసం మృతదేహాలైనా అప్పగించాలని ప్రాధేయపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీషా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల బృందంతోపాటు ఏలూరు రేంజ్​ డీఐజీ ఖాన్ పోలీసు అధికారులతో కలిసి... ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. నదిలో ఇవాళ రెండు మృతదేహాలు లభ్యమైనా ఇవి బోటు ప్రమాదానికి సంబంధించినవి కాదని అధికారులు తేల్చారు. ముంబయి నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందం నివేదిక తర్వాతే బోటు ఎలా బయటకు తీసేది నిర్ణయించగలమని సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీషా తెలిపారు.

ఇదీ చూడండి:

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_01_Grama_Sachivaalya_Exams_AV_AP10004

Body:గ్రామ సచివాలయం పరీక్షల సందడి మొదలైంది అనంతపురం జిల్లా కదిరిలో 28 కేంద్రాల్లో 7705 పరీక్ష రాస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కదిరి పట్టణానికి చేరుకునేందుకు అభ్యర్థుల ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పట్టణంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రధాన కూడళ్లలో హెల్ప్లైన్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్న నిబంధనతో కేంద్రాల వద్ద అభ్యర్థులు వారి కుటుంబ సభ్యుల హడావిడి కనిపించింది. పరీక్షలు రాయడానికి అట్టలు, మొబైల్ ఫోన్లు వాచీలు తెచ్చుకున్న అభ్యర్థులు వాటిని కేంద్రం లోకి అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. బాలుర జూనియర్ కళాశాల కేంద్రంలో ఎక్కువమంది చంటి పిల్లల తల్లులు పరీక్ష రాస్తున్నారు. పిల్లలను చూసుకోవడానికి కుటుంబ సభ్యులు కేంద్రం బయట ఉండిపోయారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు, సంబంధిత యంత్రాంగము పటిష్ట ఏర్పాట్లను చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే అభ్యర్థులను క్షుణ్నంగా పరిశీలించారు అనుమతిస్తున్నారు.

Conclusion:
Last Updated : Sep 19, 2019, 5:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.