రేపట్నుంచి తమిళనాడు, కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళలో ఈశాన్య రుతుపవన వర్షాలు కురవనున్నాయి. మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నైరుతీ బంగాళాఖాతంలో 3.1 నుంచి 5.8 కి.మీ. వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
వచ్చే మూడ్రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే మూడ్రోజులపాటు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉండే అవకాశముందని తెలిపింది.
ఇదీ చదవండి: 'రైతులకు బేడీలా? ఇదేనా రైతు రాజ్యం?'