ETV Bharat / state

పెళ్లైన నాలుగు నెలలకే దారుణం.. దంపతుల అత్మహత్య..!

చూడ ముచ్చటైన జంట. నాలుగు నెలల క్రితమే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. తమకు తామే మరణ శాసనాన్ని రాసుకున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం.. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

new married couple suicide
new married couple suicide
author img

By

Published : Oct 30, 2021, 4:46 PM IST

Updated : Oct 31, 2021, 10:15 AM IST

విజయనగరం జిల్లా కొత్తవలసలో విషాదం చోటు చేసుకుంది. పైళ్లైన నాలుగు నెలలకే కొత్తజంట బలవన్మరణానికి పాల్పడింది. గ్రామస్థులు, బంధుమిత్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తవలస మండలం చీపురువలసకు చెందిన కర్రి రాముకి.. తూర్పుగోదావరి జిల్లా పెద్దపురానికి చెందిన హేమదుర్గతో ఈ ఏడాది జులై ఒకటో తేదీన వివాహం జరిగింది.

రాము ప్రొక్లైన్ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఇటీవలే అతని తల్లి మరణించింది. తండ్రితోపాటు చెల్లి కూడా భర్త పిల్లలతో కలిసి రాము వద్దే ఉంటోంది. ఏం జరిగిందో తెలీదు నూతన వధువు హేమదుర్గ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన రాము.. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నూతన దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

FARMER SUICIDE: అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య

Last Updated : Oct 31, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.