ETV Bharat / state

కాకినాడ తీరంలో... సైనిక విన్యాసాలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రతీరంలో ఇండో అమెరికా త్రివిధ దళాల రహస్య విన్యాసాలు కొనసాగుతున్నాయి.

కాకినాడ తీరంలో... సైనిక విన్యాసాలు
author img

By

Published : Nov 20, 2019, 10:17 AM IST

Updated : Nov 20, 2019, 12:36 PM IST

కాకినాడ తీరంలో... సైనిక విన్యాసాలు

ఈ నెల 21 వరకు తీరంలో ఇండో-అమెరికా త్రివిధ దళాల రహస్య విన్యాసాలు జరుగుతాయి. నౌకాదళ రియర్‌ అడ్మిరల్‌ సూరజ్‌ భేరి, డీఎస్పీ కుమార్ పర్యవేక్షణలో వీటిని నిర్వహిస్తున్నారు.

తీరానికి సూదూరంలో విన్యాసాలు
మెకనైజ్డ్‌ లాంగ్‌ క్రాఫ్ట్‌లు, స్పీడ్‌ జెమిని బోట్లలో తీరానికి సుదూరంలో విన్యాసాలు సాగించాయి. ZP5177, IH236, ఛేతక్‌ హెలికాఫ్టర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. ప్రకృతి విపత్తుల్లో భూభాగం నుంచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించే అవకాశం లేనప్పుడు సైనికులు సముద్రమార్గం ద్వారా వచ్చి రక్షించే ప్రక్రియలను ఈ విన్యాసాల్లో నిర్వహిస్తున్నారు. విన్యాసాల్లో సైనికులకు ప్రమాదం జరిగితే సూపర్‌ స్పెషాల్టీ వైద్యసేవలు అందించడానికి నిపుణులైన వైద్య సిబ్బంది, పరికరాలతో సిద్దం చేసిన సందాయక్‌ నౌకలు తీరానికి వస్తున్నాయి.

సందర్శకులకు అనుమతి లేదు
భద్రతా కారణాల దృష్ట్యా సైనిక విన్యాసాలను వీక్షించేందుకు సందర్శకులను అనుమతించటం లేదు. కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రహదారిని కూడా ఇప్పటికే మూసివేశారు.

ఇవీ చదవండి.

టైగర్‌ ట్రంప్‌-2019కి సర్వం సిద్ధం !

sample description
Last Updated : Nov 20, 2019, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.