ETV Bharat / state

ఊపందుకున్న ఉపాధి... కూలీలకు సిరుల పంట

author img

By

Published : Apr 29, 2020, 8:56 AM IST

జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ఊపందుకున్నాయి. ఈనెల 1 నుంచి ఈ పథకం ద్వారా పనులు చేస్తున్నప్పటికీ 14 నుంచి వీటికి లాక్‌డౌన్‌ నుంచి పూర్తిస్థాయిలో మినహాయింపు ఇవ్వడంతో వేతనదారుల హాజరు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజూ 1.70 లక్షల మంది హాజరవుతున్నారు.

narega works in east godavari
తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధి హామీ పనులు

జిల్లాలోని 62 మండలాలు, 1,069 పంచాయతీలు, 2,808 ఆవాసాల పరిధిలో 6,29,949 మందికి ఉపాధి జాబ్‌ కార్డులున్నాయి. వీరి పరిధిలో 47,173 శ్రమశక్తి సంఘాలున్నాయి. ఈనెల 1 నుంచి 25వ తేదీ వరకూ 9,73,000 పని దినాలు కల్పించారు. వీటిలో 2,22,000 పని దినాలకు రూ.4.81 కోట్ల వేతనాలు చెల్లించారు. ఇంకా రూ.15.50 కోట్ల మేర వేతనాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం రోజూ 1.70 లక్షలకు పైగా కూలీలు పనులకు హాజరౌతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.59 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం సగటు వేతనం రూ.223 చెల్లిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖరీఫ్‌ సాగు మొదలయ్యే వరకూ పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని భావిస్తున్నారు.

వీటికి ప్రాధాన్యం

క్లస్టర్ల పరిధిలో రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతున్నారు. కాలువలు, చెరువుల్లో పూడికతీత, నీటి సంరక్షణ పనులు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువైనా ఇప్పటి వరకు పని ప్రదేశంలో మజ్జిగ పంపిణీ చేపట్టలేదు. మంచినీళ్లు మాత్రమే ఇస్తున్నారు. కొవిడ్‌-19 నిబంధనల్లో భాగంగా పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, పొగాకు ఉత్పత్తులు వినియోగించకుండా చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల పర్యవేక్షణ లోపంతో వీటి అమలు అంతంత మాత్రంగానే ఉంది.

పని కల్పించకుంటే ఫిర్యాదు చేయవచ్చు

జాబ్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికీ పని కల్పించాలని ఈ పథకం లక్ష్యం. దీనిలో భాగంగా పది క్లస్టర్ల పరిధిలోని సహాయ పథక సంచాలకులు, ఎంపీడీవోలు పని కల్పించడానికి చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎక్కడైనా కోరిన వారికి పని కోరితే కల్పించకపోతే వీరికి ఫిర్యాదు చేయవచ్ఛు క్షేత్రస్థాయిలో సిబ్బంది పని కల్పించకుండా తాత్సారం చేసినా వీరికి సమాచారం అందించవచ్ఛు డ్వామా కార్యాలయంలో 0884-2386423 నంబరుతో కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఫిర్యాదు చేయవచ్ఛు

భౌతిక దూరం పాటించేలా చర్యలు

జిల్లాలో రెడ్‌జోన్‌ పరిధిలోకి వచ్చే రాజమహేంద్రవరం గ్రామీణం, కడియం, రాజానగరం మండలాల్లో ఉపాధి హామీ పనులను ప్రస్తుతం నిలిపివేశాం. మిగతాచోట్ల కొనసాగుతున్నాయి. పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. చేతులు శుభ్రం చేసుకోడానికి సబ్బులు ఏర్పాటు చేశాం. మాస్క్‌లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. -ఎం.శ్యామల, పథక సంచాలకులు, డ్వామా

ఇదీ చదవండి...గుజరాత్​ నుంచి స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.