NABARD Chairman: సంఘాలు రుణాలు మంజూరు చేయడంతోపాటు ప్రజాప్రయోజన వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలను ఆర్జించాలని నాబార్డ్ చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు అన్నారు. నాబార్డు అందిస్తున్న రుణాలను వ్యాపారాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.
పెదపాడు సహకార సంఘం పరిధిలో పెట్రోల్ బంకు, విత్తన శుద్ధి కర్మాగారం తదితర వ్యాపారాలు చేయడాన్ని ఆయన అభినందించారు. పశ్చిమగోదావరి జిల్లా.. పెదపాడు సహకార సంఘం పరిధిలోని విత్తన శుద్ధి కర్మాగారాన్ని ఆయన గురువారం సందర్శించారు. విత్తనాలు శుద్ధిచేయడం, మొలక కట్టడం లాంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇదీ చదవండి: A Woman Story: ఆమె అతనికి వెన్ను...ఆ కుటుంబానికి దన్ను