తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలోని తెదేపా నేత వెన్న శివపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రత్యర్థుల నుంచి చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దాడిని ఖండిస్తూ తెదేపా శ్రేణులు ఒక్కసారిగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగాయి. వైకాపాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి శివ అలియాస్ ఈశ్వరుడిని హత్య చేయబోయాడంటూ అతన్ని అదుపులోకి తీసుకోవాలంటూ తెదేపా నేతలు డిమాండ్ చేశారు. తెలుగుదేశం శ్రేణుల ఆందోళనతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని డీఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే హత్యలకు, దాడులకు పాల్పడుతున్నారంటూ తేదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇవీ చూడండి-'సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదు'