రోజులు గడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినా అక్కడి ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మడివరం, తాళ్లరేవు, ఐ.పోలవరం మండలాల్లో 6 లంక గ్రామాలు ఉన్నాయి. అక్కడ సుమారు 15 వేల మంది ప్రజలు వంశపారంపర్యంగా వస్తున్న ఉపాధి మార్గాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ మండలాల్లోని ప్రజలు ప్రతి చిన్న అవసరానికి పడవలో ప్రయాణం చేయాలి. కొన్నిసార్లు ఇంజన్ల లోపాలతో అవి మధ్యలోనే మొరాయిస్తున్నాయి. ఇన్ని ప్రభుత్వాలు మారినా...ప్రయాణ మార్గాలు సరిగ్గా లేక అక్కడి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
వీరికి మరో ప్రధాన సమస్య తాగునీరు. నగరంలో చుట్టూ చెరువులు ఉన్నా లంకగ్రామాలకు మాత్రం నీటిసరఫరా అందించలేకపోతున్నారు అధికారులు. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదలు వస్తున్న సమయాల్లో పడరాని పాట్లు పడుతున్నారు స్థానికులు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజల పథకం ద్వారా కొంతవరకు వారి దాహార్తి తీర్చగలుగుతున్నారు. అయినా పూర్తి స్థాయిలో తమ అవసరాలు తీరేలా నీటి సరఫరా లేదని లంక గ్రామాల ప్రజలు ఆవేదన చెందారు. వర్షాలు పడుతున్నా.. తాగు నీటి కోసం డబ్బులు ఖర్చు చేయాల్సివస్తోందని చెబుతున్నారు.
ఇవి చూడండి:'నిశ్శబ్దం'గా ఉండమంటున్న అనుష్క చేతులు