పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానే : ముద్రగడ తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్రవిమర్శలు చేస్తూ.. మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఓ లేఖను విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ లేఖను మీడియాకు అందించారు. కాపుజాతి ఉద్యమం మొదలైంది చంద్రబాబు వల్లేనన్న ఆయన.. ఉద్యమ సమయంలో పెట్టిన కేసులపై ఇప్పటి వేధిస్తున్నారన్నారు. కాపు నేతలు వారి హక్కుల కోసం పోరాటం చేస్తే... మీడియాలో ప్రసారం కాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో తన కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానేనని ముద్రగడ ఆరోపించారు. ఇప్పుడు.. పోలీసులు ప్రభుత్వ పక్షం వహిస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇదీ చదవండి :
అరాచకాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు: చంద్రబాబు