సీఎం జగన్ గతంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో " ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు" కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
వైకాపా పథకాలు..
వైకాపా సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ అనపర్తి రైల్వే స్టేషన్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు.
నివాళులు..
అనంతరం కెనాల్ రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి