ETV Bharat / state

తీరప్రాంత గ్రామాల్లో ఎంపీ గీత, కలెక్టర్ మురళీధర్ పర్యటన - Kakinada Mp Geetha latest News

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం తీర ప్రాంత గ్రామాల్లో కాకినాడ ఎంపీ గీత, కలెక్టర్ మురళీధర్ రెడ్డితో కలిసి పర్యటించారు. తుఫాన్ ప్రభావంతో కోతకు గురైన ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం తదితర గ్రామాల్లో ఇళ్లను వారు పరిశీలించారు. అనంతరం సముద్ర కోత ప్రభావాన్ని అంచనా వేసి బాధితులతో మాట్లాడారు.

తీరప్రాంత గ్రామాల్లో పర్యటించిన ఎంపీ గీత, కలెక్టర్ మురళీధర్

author img

By

Published : Oct 14, 2020, 12:44 AM IST

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం తీర ప్రాంత గ్రామాల్లో కాకినాడ ఎంపీ గీత, జిల్లా పాలనాధికారి మురళీధర్ రెడ్డి పర్యటించారు. తుఫాన్ ప్రభావంతో కోతకు గురైన ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం తదితర గ్రామాల్లో పర్యటించారు. అనంతరం సముద్ర కోత ప్రభావాన్ని పరిశీలించారు. కోత ప్రభావం కారణంగా నివాసాలు కోల్పోయిన బాధితులు పునరావాస కేంద్రంలో ఉండగా వారి వద్దకు వెళ్లి పరామర్శించారు.

తీరప్రాంత గ్రామాల్లో పర్యటించిన ఎంపీ గీత, కలెక్టర్ మురళీధర్
తీరప్రాంత గ్రామాల్లో పర్యటించిన ఎంపీ గీత, కలెక్టర్ మురళీధర్

అందరికీ ఇళ్ల స్థలాలు..

ఇల్లు కోల్పోయిన అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా ఇల్లు నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. కోత నివారణకు రక్షణ కల్పించేందుకు ఇటీవలే కేంద్ర బృందంతో పర్యటించి ప్రణాళిక సిద్ధం చేశామని ఎంపీ గీత పేర్కొన్నారు. ఇందుకు సంబంధిత ఫైలు ప్రధాని దగ్గర ఉందన్నారు. ఆయన పరిశీలన అనంతరం త్వరలోనే శాశ్వత పరిష్కారం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి :

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.