ETV Bharat / state

రాజమహేంద్రవరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం: ఎంపీ భరత్​ - mp bharath news

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీ భరత్​ తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.

MP Bharath on development works
అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎంపీ భరత్​
author img

By

Published : Nov 19, 2020, 5:25 PM IST

రాజమహేంద్రవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నట్లు ఎంపీ భరత్ చెప్పారు. విలీన గ్రామాలను కలుపుకొని 165 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరాన్ని విస్తరిస్తామని అన్నారు. రాజమహేంద్రవరం-కాకినాడ మధ్య కెనాల్ రహదారి విస్తరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఆర్ట్స్ కళాశాల లేదా నన్నయ విశ్వవిద్యాలయం మైదానంలో అనువైన స్థలాన్ని ఎంచుకుని క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని వివరించారు.

నగరంలో అన్ని ప్రధాన రహదారుల మధ్య డివైడర్లు ఏర్పాటు చేసి, మొక్కలతో సుందరీకరిస్తామని ఎంపీ అన్నారు. మోరంపూడి వద్ద పైవంతెన నిర్మాణం అంచనాను జాతీయ రహదారుల సంస్థకు త్వరలో సమర్పిస్తామని చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంఘాలను రుడా(రాజమండ్రి అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ) కిందకు తీసుకురావాలనే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు. ఔటర్ రింగు రోడ్డు నిర్మించే యోచన కూడా ఉన్నట్టు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్, సంబంధిత అధికారులతో కలిసి అభివృద్ధి పనుల్ని పరిశీలించారు.

ఇదీ చదవండి: పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.