ETV Bharat / state

21నెలల బుడతకి బంగారు పతకం - 21నెలల బుడతకి బంగారు పతకం

నిండా రెండేళ్లు లేని పాప తన మేధస్సుతో బంగారు పతకం గెలుచుకుంది. వయసుకు మించిన తెలివితేటలు ప్రదర్శిస్తూ ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

months baby own gold medal
months baby own gold medal
author img

By

Published : Aug 31, 2020, 7:19 PM IST

తూర్పుగోదావరి ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామానికి చెందిన సాయిరాజ్ సింధు దంపతులు కుమార్తె సుమేధ అద్భుత మేధస్సును ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. తల్లి ఒడిలో, తండ్రి గుండెలపై ఆడుకోవాల్సిన వయసులో రాష్టాల రాజధానులన్నీ చెప్పేస్తోంది. అమ్మమ్మ తాతయ్యలతో బోసినవ్వులు నవ్వే వయసులో మూగ జీవాల అరుపులతో ఆశ్చర్యపరుస్తోంది. బుడిబుడి అడుగులతో సవ్వడులు చేసే వయసులో జంతువులు, పక్షులను గుర్తిస్తోంది. ప్రముఖ దేవాలయాల పేర్లతో సహా ఎన్నో విషయాలు అవలీలగా చెప్పేస్తోంది.

జులై 6న ఆన్​లైన్​లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నిర్వహించిన పరీక్షలో విజేతగా నిలిచి బంగారు పతకం, ప్రశంస పత్రం గెల్చుకొంది. సుమేధ ప్రజ్ఞకి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.