ETV Bharat / state

'కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది'

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. వైకాపా నాయకులు పార్టీలు, ర్యాలీలు, సమావేశాలు, సన్మానాలు నిర్వహించి కరోనా వాహకులుగా మారారని విమర్శించారు.

author img

By

Published : Jul 22, 2020, 6:56 PM IST

mla vanpudi vennkateswar rao comments on ysrcp government
కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు

కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వైకాపా ప్రభుత్వం ఒక్క ప్రయత్నమూ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. లాక్ డౌన్ సమయంలో వైకాపా నాయకులు పార్టీలు, ర్యాలీలు, సమావేశాలు, సన్మానాలు నిర్వహించి కరోనా వాహకులుగా మారారని వెంకటేశ్వరరావు విమర్శించారు.

కరోనా కష్టకాలంలోనూ వైకాపా నాయకులు కుంభకోణాలకే ప్రాధాన్యత ఇచారని వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వైరస్ కు అందుతున్న చికిత్సపై నమ్మకం లేకనే వైకాపా నాయకులు పక్క రాష్ట్రాలలో చికిత్స పొందుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి: నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.