తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు ముంగండ గ్రామంలో ఉదయం 5 నుంచి 9 గంటల వరకు సందర్శించారు. కాలినడకన గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మురుగు కాలువలు, నివేశన స్థలాలు, రహదారులు ఇలా పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గ్రామ సందర్శన చేస్తున్నానని.. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం భవనం నిర్మించినా.. పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాలేదని స్థానికులు తెలిపారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి: పి.గన్నవరంలో సామాజిక పింఛన్ల డబ్బులు పంపిణీ