తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట - పిఠాపురం మధ్య ఉన్న వంతెన కూలిపోయింది. కూలిన ఆ వంతెనను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి తెదేపా హయాంలోనే నిధులు మంజూరు చేశామని తెలిపారు. శిథిలమైన వంతెనను గత నెలలో పరిశీలించి రాకపోకలు నిలిపి వేయాలని అధికారులకు సూచించామన్నారు. హెచ్చరిక బోర్డు కూడా పెట్టలేదని స్థానికులు చెప్పారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మార్గం కాబట్టి తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయాలని చినరాజప్ప అన్నారు. నూతన బ్రిడ్జి పనులు కూడా జరుగుతున్నాయని.. నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాజధాని గ్రామాల్లో 'అమరావతి వెలుగు' పేరుతో నిరసనలు